నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ‘దేవర’ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌తో దూసుకెళ్తోంది.
ఇక ఈ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ డాలర్లు కేవలం ప్రీ-సేల్స్ రూపంలోనే రాబట్టిన ‘దేవర’, ఆస్ట్రేలియా బాక్సాఫీస్ దగ్గర కూడా విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ సినిమా ఆస్ట్రేలియా బాక్సాఫీస్ దగ్గర ప్రీ-సేల్స్ రూపంలో ఇప్పటికే 300K ఆస్ట్రేలియా డాలర్లు దాటి దూసుకుపోతుంది.
ఈ దూకుడు ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు. ‘దేవర’ మేనియాతో ప్రస్తుతం అభిమానులు ఊగిపోతున్నారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.