ఈ క్రేజీ సీక్వెన్స్ షూట్ లో బిజీగా “దేవర”

Published on Sep 14, 2023 9:01 am IST

గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉండగా చిత్ర యూనిట్ అయితే ఈ సినిమాని హాలీవుడ్ లెవెల్ హంగులతో భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ క్రేజీ సీక్వెన్స్ ని అండర్ వాటర్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

దీనికి గాను ఎన్టీఆర్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకోగా ఇప్పుడు ఈ సీక్వెన్స్ షూటింగ్ నే భారీ సెట్స్ నడుమ జరుగుతుందట. బ్లూ మ్యాట్స్ నడుమ వేసిన వాటర్ పూల్ లో అయితే ఈ క్రేజీ సీక్వెన్స్ ని మేకర్స్ ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. దీనితో ఈ సీన్ కి సంబంధించి ఓ పిక్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :