స్పెషల్ వీడియోతో “దేవర” టీం తమ కెప్టెన్ కి బర్త్ డే విషెస్

స్పెషల్ వీడియోతో “దేవర” టీం తమ కెప్టెన్ కి బర్త్ డే విషెస్

Published on Jun 15, 2024 2:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడానికి దగ్గరగా వస్తుండగా సినిమా కెప్టెన్ ఆఫ్ ది షిప్ కొరటాల శివ బర్త్ డే వచ్చింది.

మరి ఈ సినిమాని కొరటాల భారీ హంగులతో తన గత సినిమా ప్లాప్ ఎఫెక్ట్ ఏమాత్రం కనిపించకుండా పర్ఫెక్ట్ పాన్ ఇండియా హైప్ ని దీనికి తెచ్చుకోగలిగారు. అయితే లేటెస్ట్ గా తనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా సెట్స్ లో తాను ఎంత కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారో సినిమాలో తయారు చేసిన ఆయుధాలతో కనిపిస్తున్నాడు.

అలాగే తారక్ తో కూడా మంచి హ్యాపీ మూమెంట్స్ ఇందులో కనిపిస్తున్నాయి. ఇక దీనితో పాటుగా ఇండియన్ సినిమా దగ్గర కొరటాల తన విజన్ తో ఒక తుఫాన్ సృష్టించబోతున్నారు అంతా సిద్ధంగా ఉండండి అంటూ పవర్ ఫుల్ స్పెషల్ విషెస్ ని దేవర టీం అందించారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు