దేవదాస్ అక్కడ కూడా భారీ స్థాయిలో విడుదలవుతుంది !

కింగ్ నాగార్జున, నాని లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’ విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల వేడుక ఈరోజు హైదరాబాద్లో ఘనంగా జరుగనుంది.

ఇక ఈచిత్రం తెలుగు తో పాటు తమిళ భాషలోనూ భారీ స్థాయిలో విడుదలవుతుంది. శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రష్మిక, ఆకాంక్ష సింగ్ లు కథానాయికలుగా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈచిత్రం ఈనెల 27న విడుదలకానుంది.

ఇక నాగ్ ఈచిత్రం తరువాత ధనుష్ దర్శకత్వంలో నటించనున్నారు. ద్విభాష చిత్రంగా రూపొందుతున్న ఈసినిమాలో ఆయన, ధనుష్ తో కలిసి నటించనున్నారు. ఈచిత్రంతో నాగ్ కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ప్రారంభమైంది.

Exit mobile version