అదే మ్యాజిక్ చేసిన దేవి..మాస్ ‘పుష్ప’ రాజ్ అదరగొట్టాడు.!

Published on Oct 28, 2021 12:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప ది రైజ్”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి కలగడానికి మరో కారణం ఈ సినిమా కాంబినేషన్ అని కూడా తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ లి కలిస్తే ఆ కాంబో రచ్చే వేరేగా ఉంటుంది.

అందుకే ఈ కాంబోకి స్పెషల్ బ్రాండ్ ఏర్పడింది. ఇక ఇదే విధంగా వీరి నుంచి హ్యాట్రిక్ సినిమా పుష్ప వస్తుంది అంటే ఈ ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొనగా ఆల్రెడీ రెండు సాంగ్ పెద్ద చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక మళ్ళీ మూడో సాంగ్ అందులోని పుష్ప రాజ్ మాస్ సాంగ్ “సామి సామి” కూడా మంచి అంచనాలు నడుమ ఇప్పుడు రిలీజ్ అయ్యింది.

దీనితో కూడా మళ్ళీ దేవి తన మ్యాజిక్ చూపించాడని చెప్పాలి. మొదటి రెండు పాటలకి కూడా ఏమాత్రం తీసిపోకుండా సుకుమార్ అభిరుచికి అద్దం పట్టేలా ఫ్రెష్ ట్యూన్ ని అందించాడు. లాస్ట్ టైం శ్రీవల్లి కోసం పుష్ప రాజ్ పాట పాడితే ఈసారి పుష్ప కోసం శ్రీవల్లి డెడికేషన్ బాగుంది. ఇంకా ఇందులో సాహిత్యం కానీ రష్మికా గ్లామ్ షో కానీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ అన్నీ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. ఫైనల్ గా పుష్ప ఖాతాలో ఇంకో చార్ట్ బస్టర్ పడింది అని చెప్పాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More