పవన్, హరీష్ శంకర్ కంటే ముందే డిఎస్పీ

Published on May 6, 2021 1:35 am IST

రీఎంట్రీ ఇచ్చాక పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఇంతకుముందులా ఏడాదికి ఒక సినిమాతో సరిపెడితే కుదరదని రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆయన ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ తెలుగు రీమేక్ మరియు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు. పవన్ కోవిడ్ కారణంగా ఐసోలేషన్లో ఉండటంతో ఈ సినిమాల షూటింగ్ ఆగింది. ఇంకో నెల లేదా నెలన్నరలో చిత్రీకరణ రీస్టార్ట్ కావొచ్చు. ఇవి పూర్తికాకముందే ఆయన హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టనున్నారు. పవన్ రీఎంట్రీ తర్వాత చేస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో దేవి, పవన్, హరీష్ శంకర్ కలయికలో ‘గబ్బర్ సింగ్’ రూపొందింది. ఆ సినిమా మ్యూజిక్ పరంగా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. అందులోని ప్రతి పాట హిట్టే. ఇప్పుడు కూడ అలాంటి పాటలే రూపొందించే పనిలో ఉన్నారట డిఎస్పీ. ఇప్పటికే రెండు పాటలు కంప్లీట్ అయ్యాయట. దేవిశ్రీప్రసాద్ స్పీడ్ చూస్తోంటే సినిమా మొదలుకాకముందే పాటలు రెడీ చేసి హరీష్ శంకర్ చేతిలో పెట్టేలా ఉన్నారు.

సంబంధిత సమాచారం :