“పుష్ప 2” కి మళ్ళీ రఫ్ఫాడిద్దాం.. దేవి రిప్లై వైరల్.!

Published on Aug 14, 2022 8:00 am IST

ఇప్పుడు మళ్ళీ మన టాలీవుడ్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎరా స్టార్ట్ అయ్యింది. ఆ మధ్య డీఎస్పీ పై పలు కామెంట్స్ వినిపించినా కూడా ఉప్పెన, రంగ్ దే సినిమాలతోనే దేవి సత్తా చాటాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ తో చేసిన “పుష్ప” అయితే నేషనల్ వైడ్ సెన్సేషన్ అయ్యింది.

ఇక దీని తర్వాత మెగా 154, వారియర్, ఇతర సినిమాలకు కూడా చాలా ఫ్రెష్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్న దేవి నుంచి అంతా ఇప్పుడు పుష్ప 2 ఆల్బమ్ కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి పుష్ప 2 కి మాత్రం రఫ్ఫాడిద్దాం అన్నట్టు ఐకాన్ స్టార్ కి దేవిశ్రీ ప్రసాద్ పెట్టిన రిప్లై వైరల్ గా మారింది.

రీసెంట్ గా దేవి బర్త్ డే కి అల్లు అర్జున్ ట్విట్టర్ లో విష్ చెయ్యగా అది తాను చూసుకోలేదని బన్నీ ఫ్యాన్స్ కి సారి చెప్తూ బన్నీ విషెష్ కి థాంక్స్ చెబుతూ పుష్ప 2 కి మళ్ళీ అదరగొట్టి ఆ ఆల్బమ్ ని కూడా ఐకానిక్ గా మారుద్దామని క్రేజీ రిప్లై ఇచ్చాడు. దీనితో ఇది మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :