ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప” ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. మరి ఈ చిత్రంకి గ్రాండ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ అయితే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ స్కేల్ లో అయితే తెరకెక్కిస్తూ మరిన్ని అంచనాలు సెట్ చేసుకుంది.
ఇక ఈ భారీ సినిమాపై రీసెంట్ గానే పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా రాగా ఈ సినిమాకి సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అయితే లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. ఈరోజు 10 గంటలకి ఓ ఎగ్జైటింగ్ అప్డేట్ రాబోతుంది అని ఓ వీడియోలో పుష్ప సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అందించాడు. దీనితో ఇది పుష్ప 2 కి సంబంధించి మ్యూజికల్ అప్డేట్ కోసమా అనేది ఎగ్జైటింగ్ గా మారింది. మరి అది ఏ అప్డేట్ అనేది కాస్త ఆగి చూడాల్సిందే.
— DEVI SRI PRASAD (@ThisIsDSP) September 14, 2023