రామ్ “ది వారియర్” నుండి దడ దడ సాంగ్ ను రిలీజ్ చేయనున్న గౌతమ్ మీనన్!

Published on Jun 3, 2022 9:00 pm IST

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. ఈ చిత్రం లో రామ్ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. రామ్ సరసన హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతి శెట్టి నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం నుండి దడ దడ అనే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ దడ దడ అనే పాటను తెలుగు మరియు తమిళ భాషల్లో రేపు మధ్యాహ్నం 12:07 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. జూలై 14 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :