ధమాకా: మూడు రోజుల్లో 32 కోట్లు!

ధమాకా: మూడు రోజుల్లో 32 కోట్లు!

Published on Dec 26, 2022 11:45 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రిలీజైన మొదటి రోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం, మంచి రివ్యూ లు రావడం తో వసూళ్ల పై ప్రభావం చూపింది. ఈ చిత్రం తోలి రోజు కంటే మూడో రోజు భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం మూడు రోజుల్లో 32 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం లో సచిన్ ఖేదేకర్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, రావు రమేష్, సత్యం రాజేష్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు