వరల్డ్ వైడ్ “ధమాకా” సెన్సేషన్..4 రోజుల్లో అదిరే వసూళ్లు.!

వరల్డ్ వైడ్ “ధమాకా” సెన్సేషన్..4 రోజుల్లో అదిరే వసూళ్లు.!

Published on Dec 27, 2022 10:02 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా దర్శకుడు త్రినాథనరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ ఎంటర్టైనింగ్ చిత్రం “ధమాకా” కోసం తెలిసిందే. మరి మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అక్కడ నుంచి అయితే సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం మొదటి మూడు రోజు బాక్సాఫీస్ దగ్గర అదిరే వసూళ్లు రాబట్టగా కీలకమైన వర్కింగ్ డే మండే కూడా సాలిడ్ వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ అయితే తెలిపారు.

ఇక ఇప్పుడు అయితే ఈ నాలుగు రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు కూడా ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి ధమాకా అయితే ఈ నాలుగు రోజుల్లో మొత్తంగా 41 కోట్ల సాలిడ్ వసూళ్లు నమోదు చేసినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో మాస్ మహారాజ క్రాక్ తర్వాత మళ్ళీ భారీ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు