“ధమాకా” 8 రోజుల సాలిడ్ వసూళ్లు ఎంతంటే.!

“ధమాకా” 8 రోజుల సాలిడ్ వసూళ్లు ఎంతంటే.!

Published on Dec 31, 2022 11:02 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ధమాకా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ చిత్రం కొత్త ఏడాది వచ్చేవరకు కూడా సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రం ఇప్పుడు 8 రోజుల్లో మరింత బెటర్ వసూళ్లతో నడుస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమా అయితే 8 రోజుల్లో 69 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ తెలిపారు. దీనితో రవితేజ మాస్ స్టామినా తో మరోసారి సెన్సేషన్ ని సృష్టించారు. అలాగే ఈ శుక్రవారం సినిమాలు కూడా పెద్దగా ఎఫెక్టీవ్ గా లేవు కాబట్టి ధమాకా ఈ వారం సహా సంక్రాంతి వరకు కూడా సినిమా హవా అప్పటి వరకు కూడా కొనసాగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు