కొనసాగుతున్న “ధమాకా” మాస్ బుకింగ్స్.!

కొనసాగుతున్న “ధమాకా” మాస్ బుకింగ్స్.!

Published on Dec 31, 2022 8:00 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్ హిట్ చిత్రం “ధమాకా”. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం అయితే రవితేజ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా ఇప్పుడు అంతకంతకూ సూపర్ స్ట్రాంగ్ గా నిలుస్తూ దూసుకెళ్తుంది.

సినిమా వచ్చి వారం అయ్యినా పైగా ఇప్పుడు రెండో వీకెండ్ పైగా ఇయర్ ఎండ్ కూడా కావడంతో ధమాకా ఆన్లైన్ బుకింగ్స్ లో కూడా హవా చూపిస్తుంది. దీనితో నిర్మాణ సంస్థ ధమాకా మాస్ బుకింగ్స్ చూసి అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అయితే భీమ్స్ సంగీతం అందించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు