రవితేజ కెరీర్లో అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ధమాకా’

రవితేజ కెరీర్లో అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ధమాకా’

Published on Dec 28, 2022 6:07 PM IST

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా తో కెరీర్ పరంగా మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో జయరాం, తనికెళ్ళ భరణి, తులసి, రావు రమేష్, హైపర్ ఆది వంటి వారు కనిపించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన ఈమూవీకి భీమ్స్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ధమాకా మూవీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి అన్ని వర్గాల ఆడియన్స్ మెప్పుతో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళుతోంది.

అయితే విషయం ఏమిటంటే, ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రస్తుతం ధమాకా మూవీ అటు ఓవర్సీస్ లో సైతం మంచి కలెక్షన్స్ తో కొనసాగుతుండడం విశేషం. నిజానికి మాస్ మసాలా సినిమాలు ఓవర్సీస్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోవని, కానీ ధమాకా మూవీ కంటెంట్ మాత్రం అక్కడి ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని దూసుకెళుతోందని అంటున్నారు సినీ ట్రేడ్ అనలిస్టులు. అలానే ముఖ్యంగా ఈ మూవీ రవితేజ మొత్తం కెరీర్ లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీగా ధమాకా రికార్డు క్రియేట్ చేసిందని ఆనందం వ్యక్తం చేస్తోంది మూవీ యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు