ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ కొట్టిన మాస్ రాజా ‘ధమాకా’

ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ కొట్టిన మాస్ రాజా ‘ధమాకా’

Published on Jan 1, 2023 1:11 AM IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ మూవీకి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు ఈమూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఇక కొద్దిరోజుల క్రితం మంచి అంచనాలతో రిలీజ్ అయిన ధమాకా మూవీ తొలి రోజు తొలి ఆట నుండి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుని అన్ని చోట్ల కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది.

ఇక ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 69 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకోగా, మరోవైపు ఓవర్సీస్ లో కూడా ధమాకా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. కాగా ఈ మూవీ నేటితో హాఫ్ మిలియన్ డాలర్లు దక్కించుకున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కాగా తమ మూవీకి ఇంత బాగా రెస్పాన్స్ లభిస్తున్నందుకు ఆడియన్స్ కి మాస్ రాజా ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతోంది ధమాకా యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు