డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “ధమాకా”

Published on Dec 23, 2022 7:00 pm IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ త్రినాథ్ నక్కిన రావు దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా. ఈ చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం లో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించారు. శ్రీలీల రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది.

ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం కొద్ది రోజుల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. టి.జీ. విశ్వ ప్రసాద్ నిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ సినిమా కి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. తనికెళ్ళ భరణి, తులసి, సచిన్ ఖేదేకర్, పవిత్ర లోకేష్, అలీ, హైపర్ ఆది తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :