లేటెస్ట్ : భారీ బ్లాక్ బస్టర్ దిశగా మాస్ మహారాజా ‘ధమాకా’

లేటెస్ట్ : భారీ బ్లాక్ బస్టర్ దిశగా మాస్ మహారాజా ‘ధమాకా’

Published on Dec 31, 2022 4:01 PM IST

టాలీవుడ్ నటుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు దీనిని భారీ స్థాయిలో నిర్మించాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన ధమాకా మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం భారీ హిట్ దిశగా దూసుకెళుతోంది.

మన తెలుగు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ ఆడియన్స్ ని సైతం ధమాకా ఆకట్టుకుంటోంది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ ఇటీవల ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ 3 గా అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ 1 గ్రాసర్ గా నిలిచి గొప్ప రికార్డులని సొంతం చేసుకుంది. మొత్తంగా తమ సినిమాకి ఈ విధంగా ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ లభిస్తుండడంతో ధమాకా మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు