మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద “ధమాకా” జోరు!

మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద “ధమాకా” జోరు!

Published on Dec 26, 2022 6:58 AM IST

మాస్ మహారాజా రవితేజ డ్యుయల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా. డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రెండు రోజులకు 19 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. అయితే మూడో రోజు వసూళ్లు రెండో రోజు కంటే మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంటర్టైన్మెంట్ కి కొదువ లేకుండా ఉండటం తో సినిమా కి సెకండ్ షో కి కూడా ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

ఈ చిత్రం చాలా చోట్ల హౌస్ ఫుల్ అవుతోంది. అయితే లాంగ్ రన్ లో ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించి, సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించిన ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు