మాస్ మీటింగ్ కి రెడీ అవుతోన్న ‘ధమాకా’ టీమ్

మాస్ మీటింగ్ కి రెడీ అవుతోన్న ‘ధమాకా’ టీమ్

Published on Dec 24, 2022 7:13 PM IST

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు త్రినాధరావు నక్కిన కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు కలిసి నిర్మించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. నిన్న భారీ అంచనాలతో రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ గా రెస్పాన్స్ తో దూసుకెళుతోంది ధమాకా మూవీ. ప్రస్తుతం తమ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న టీమ్, అతి త్వరలో ప్రేక్షకాభిమానుల ముందుకి మాస్ మీటింగ్ రూపంలో వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

కాగా అతి త్వరలో ఈ మాస్ మీటింగ్ యొక్క లొకేషన్ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా మేకర్స్ నుండి వెల్లడి కానున్నాయి. మాస్ మహారాజా రవితేజ సూపర్ పెర్ఫార్మన్స్, భీమ్స్ ఆకట్టుకునే సాంగ్స్, బీజీఎమ్, హీరోయిన్ శ్రీలీల అందం, దర్శకుడు త్రినాధరావు అలరించే కథనం, నిర్మాతల గ్రాండియర్ నిర్మాణ విలువలు వెరసి ధమాకా మూవీని మంచి సక్సెస్ చేశాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు