మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ మెగాస్టార్ రౌడీ అల్లుడు మాదిరిగా ఉంటుంది – ఇంటర్వ్యూలో రైటర్ ప్రసన్న కుమార్

మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ మెగాస్టార్ రౌడీ అల్లుడు మాదిరిగా ఉంటుంది – ఇంటర్వ్యూలో రైటర్ ప్రసన్న కుమార్

Published on Dec 10, 2022 9:50 PM IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఇప్పటికే ధమాకా నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీకి సంబందించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ నేడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

 

ధమాకా మూవీ జర్నీ ఎలా మొదలైంది ?
నిజానికి లాక్ డౌన్ కి ముందు ఈ మూవీ సెట్ అయింది. మొదట నేను, వివేక్ గారు కలిసి ఒక మూవీ చేయాలని భావించాము. ఆ తరువాత ఒకానొక సమయంలో రవితేజ గారు నన్ను పిలిపించి మాట్లాడారు. కొన్నాళ్ళు సరదాగా మాట్లాడిన అనంతరం ఏదైనా స్టోరీ ఉంటె చెప్పండి చేద్దాం అని ఆయన అన్నారు. అయితే ఆ టైంలో ఒక స్క్రిప్ట్ చెప్పాను కానీ అది వర్కౌట్ కాలేదు, ఆ తరువాత ధమాకా స్టోరీ చెప్పిన ఫస్ట్ సిట్టింగ్ లోనే ఆయనకు నచ్చింది. ఆ విధంగా ఈ మూవీ సెట్ అయింది. లాక్ డౌన్ కి ముందు చెప్పిన ఈ స్టోరీ కి సంబందించి ఆ తరువాత లాక్ డౌన్ లో మొత్తం స్క్రిప్ట్ పూర్తి చేశాను.

 

రవితేజ గారిని దృష్టిలో పెట్టుకుని ఈ స్టోరీ రాశారా ?
ఇటీవల రవితేజ గారి నుండి ఎక్కువగా సీరియస్ స్క్రిప్ట్ మూవీస్ వచ్చాయి. కానీ నేను మాత్రమే ఆయన మెయిన్ అసెట్ అయిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలను బేస్ చేసుకుని ఈ స్టోరీ రాసాను, రవితేజ గారు కూడా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ మూవీ చేద్దాం అని భావించారు. ఆ విధంగా ఇది సెట్ అయింది.

 

డబుల్ ఇంపాక్ట్ అనే డ్యూయల్ రోల్ ఉందా ?
అవును అండి నిజమే. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ రిచ్ మరొక క్యారెక్టర్ పూర్. అయితే వారి లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని ఇద్దరూ ఎవరి కోణంలో వారు ఏ విధంగా తీసుకున్నారు అనేది మెయిన్ థీమ్. మెగాస్టార్ చిరంజీవి గారి రౌడీ అల్లుడు మూవీ తరహాలో ఈ మూవీ ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ ని అందిస్తుంది.

 

మీరు ఎక్కువగా త్రినాధరావు నక్కినతోనే మూవీస్ చేసారు, ఆయన గురించి చెప్తారా ?
నేను ఏదైనా సీన్ చెపితే దాని ఔట్ పుట్ ఎలా ఉంటుంది అనేది త్రినాధరావు గారికి బాగా తెలుసు. అలానే నేను రాసిన డైలాగ్ బాగుంటుంది అంటే అది ఆయనకు నాపైన ఉన్న నమ్మకం. మ్మొత్తంగా మరొక్కసారి ధమాకాతో మేమిద్దరం మీ ముందుకి మంచి స్క్రిప్ట్ తో వస్తున్నాం.

 

రవితేజ గారికి స్క్రిప్ట్ చెప్పినపుడు ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసారు ?
నిజానికి నేను రవితేజ గారి మూవీస్ రాసేటపుడు పెద్దగా కష్టపడను అనే చెప్తాను. ఎందుకంటే నాలోనే ఒక చిన్న రవితేజ ఉన్నాడనేది నా ఫీలింగ్. ఇక గతంలో నేను వర్క్ చేసిన సినిమాలు అన్నిటిలో హీరో పాత్రల్లో ఆయన యొక్క ప్రభావం ఉంటుంది.

 

టాలీవుడ్ లో హైయెస్ట్ పైడ్ రైటర్ మీరు అని అందరూ చెప్తుంటారు, దాని పై మీ ఫీలింగ్?
నిజానికి నేను ఏ విషయం దాచను, ఎందుకంటే నేను ఏదో రైటర్ గా స్టోరీ, డైలాగ్స్ రాసి ఇచ్చి వెళ్లిపోయేవాడిని కాదు. సినిమా అయ్యే వరకు దాదాపుగా ప్రతి సీన్ లో నా ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. ఇక సినిమాకి అన్ని విధాలా న్యాయం చేయాలనేది నా భావన. అందరూ కూడా నా వర్క్ ని బట్టి పే చేస్తారు అంతే.

 

ధమాకా కి రీ షూట్స్ చేసారా ?
దాదాపుగా అయితే రీ షూట్స్ లేవనే చెప్తాను. ముందుగానే పక్కాగా స్టోరీ ఎంటర్టైన్మెంట్ అంశాలు అన్ని పక్కాగా కుదిరిన తరువాతనే మూవీని షూట్ చేసాము. అయితే హీరో పాత్రలో ఎగ్రెసివ్ నెస్ తగ్గిందనే భవనతో మరొక ఫైట్ యాడ్ చేసి షూట్ చేసాము, అయితే అది రీ షూట్ కిందకు రాదు.

 

ఇక ధమాకా లో కామెడీ ఎలా ఉండబోతోంది ?
సినిమా ఆద్యంతం ఆడియన్స్ ని అలరించేలా పక్కాగా ఎంటర్టైన్మెంట్ తో రాసుకున్నాం. ముఖ్యంగా రావు రమేష్, హైపర్ ఆది క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ నవ్వు ఆపుకోలేరు, అంతలా ఆ క్యారెక్టర్స్ లో కామెడీ పండింది. ఇక మచ్చ రవి, సత్యం రాజేష్ వంటి వారి ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి. హీరో క్యారెక్టర్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉండడంతో పాటు హీరోయిన్ తో వచ్చే ఆఫీస్ సీన్స్, ఇద్దరి మధ్య నడిచే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే ఐదు నిమిషాల ఎంటర్టైన్మెంట్ సీన్ అయితే మరింతగా అదిరిపోతుంది.

 

చిన్న స్థాయి నుండి స్టార్ రైటర్ స్థాయికి ఎదిగారు, ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది ?
అన్ని విధాలుగా ఎంతో సంతోషంగా ఉంది. మంచి జీవితం ఏర్పడింది అనే ఆనందం కంటే కూడా మనల్ని కని పెంచిన తల్లితండారులకు అన్ని విధాలా మంచి జీవితం ఇవ్వగలుగుతున్నాం అనే తృప్తి నిజంగా మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది.

 

ధమాకా మూవీని హిందీ లో రిలీజ్ చేస్తున్నారు, మరి అక్కడ ఆల్రెడీ అదే టైటిల్ తో మరొక మూవీ వచ్చింది కదా, దాని ఇంపాక్ట్ దీనిపై ఏమైనా ఉంటుంది అంటారా ?
నిజానికి ఈ మూవీ అక్కడ బిగ్ ధమాకా పేరుతో రిలీజ్ అవుతోంది. ఇక పోస్టర్స్ చూసిన వెంటనే ఇది సౌత్ మూవీ అని ఆడియన్స్ కి అర్ధం అవుతుంది. ఇటీవల కాలంలో అక్కడ మంచి ఎంటర్టైనర్ మూవీస్ రావడం లేదు, ఈ మూవీ ఆ లోటుని అక్కడ తీర్చి నార్త్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం.

 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి ?
ప్రస్తుతం నాగార్జున గారి కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రాస్తున్నాను, అది రీమేక్ అంటున్నారు బట్ కాదు, డైరెక్ట్ వర్షన్ మూవీనే. ఇక విశ్వక్ సేన్ తో చేస్తోన్న దాస్ కా ధమ్కీ మూవీ కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అలానే మరొక చిన్న సినిమా కూడా లైన్ లో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు