“ధమాకా”..రవితేజ – భీమ్స్ నుంచి మరో క్రేజీ ఎనర్జిటిక్ నెంబర్.!

“ధమాకా”..రవితేజ – భీమ్స్ నుంచి మరో క్రేజీ ఎనర్జిటిక్ నెంబర్.!

Published on Dec 8, 2022 4:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబోలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “ధమాకా” కోసం అందరికీ తెలిసిందే. మరి రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి అయితే మేకర్స్ ఒకో సాంగ్ ని రిలీజ్ చేస్తుండగా అవి ఒకదాన్ని మించి ఇంకొకటి హిట్ అవుతూ రావడం విశేషం. ఆల్రెడీ మాస్ మహారాజ్ మరియు సంగీత దర్శకుడు భీమ్స్ కాంబినేషన్ సూపర్ హిట్..

మరి ఇదే మ్యాజిక్ ని మళ్ళీ ధమాకా ఆల్బమ్ క్రియేట్ చేసింది అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఈ ఈరోజు మేకర్స్ దండ కడియాల్ అనే ఫోక్ బీట్ ని రిలీజ్ చెయ్యగా ఇది కూడా మంచి హిట్ అయ్యిందని చెప్పాలి. భీమ్స్ నే రాసిన ఈ పాట మంచి లిరిక్స్ తో ఆకట్టుకునేలా ఉండగా సాంగ్ విజువల్స్ కానీ అలాగే ఇందులో మాస్ మహారాజ్ ఎనర్జీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

అలాగే హీరోయిన్ శ్రీలీల కూడా మంచి ఎనర్జీతో రవితేజని మ్యాచ్ చేసింది. ఇంకా సాంగ్ మధ్యలో అయితే చిన్న పిల్లల వోకల్స్ మరింత ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా అయితే ఈ సాంగ్ మంచి క్రేజీ అండ్ ఎనర్జిటిక్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 23 వరకు ఆగాల్సిందే.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు