మరో సాలిడ్ బీట్ తో “ధమాకా” మాస్ సర్ప్రైజ్.!

మరో సాలిడ్ బీట్ తో “ధమాకా” మాస్ సర్ప్రైజ్.!

Published on Dec 6, 2022 12:22 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ధమాకా”. మళ్ళీ రవితేజ నుంచి ఓ వింటేజ్ ట్రీట్ ని ఇచ్చేలా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం అయితే అభిమానులు చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం చూస్తూ ఉండగా చిత్ర యూనిట్ ఈరోజు ఓ సర్ప్రైజ్ ఉందంటూ ఇప్పుడు ఈ సినిమా మ్యూజికల్ అప్డేట్ ని రివీల్ చేశారు.

ముఖ్యంగా సినిమా సంగీత దర్శకుడు భీమ్స్ ఒకదాన్ని మించి ఒకటి క్రేజీ సాంగ్స్ ని అందిస్తుండగా ఇక ఇప్పుడు అయితే మరో సూపర్ హిట్ అయ్యేలా ఉన్న సాంగ్ డండకడియల్ అనే మాస్ సాంగ్ ని ప్రిపేర్ చేశారు. మరి దీనిపై రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమో కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మంచి రిచ్ విజువల్స్ తో ఈ సాంగ్ ఉండేలా కూడా అనిపిస్తుంది. ఇక ఈ ట్యూన్ కూడా మంచి హమ్మింగ్ చేసే విధంగా ఉండగా మేకర్స్ అయితే ఈ ఫుల్ లిరికల్ సాంగ్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు