మాస్ రాజా ‘ధమాకా’ ప్రమోషన్స్ షురూ

మాస్ రాజా ‘ధమాకా’ ప్రమోషన్స్ షురూ

Published on Dec 6, 2022 10:06 PM IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పక్కాగా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో పీపుల్స్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలపై రూపొందిన ఈ మూవీని అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ధమాకా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా మూవీ ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకురానుంది యూనిట్.

అయితే విషయం ఏమిటంటే, ఓవైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నిన్నటి నుండి ధమాకా యూనిట్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మూవీ కథకుడు ప్రసన్న కుమార్ బెజవాడ, అలానే డైరెక్టర్ త్రినాధరావు పలు మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని ధమాకా ఆకట్టుకుని మంచి సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని డీవోపీ గా వర్క్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు