యూఎస్ లో గట్టి డిమాండ్ తో “ధమాకా” హవా.!

యూఎస్ లో గట్టి డిమాండ్ తో “ధమాకా” హవా.!

Published on Dec 27, 2022 12:00 PM IST

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరోస్ లో ఒకరైన మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ హిట్ చిత్రం “ధమాకా” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం అయితే రవితేజ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. అలాగే ఈ ఏడాది చివరికి మాత్రం మరో సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ రన్ తో దూసుకెళ్తుంది. మరి అక్కడ అయితే ఈ చిత్రం లేటెస్ట్ గా 2 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి మరింత స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. అలాగే యూఎస్ లో డిమాండ్ మేరకు మరిన్ని థియేటర్స్ యాడ్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో రావు రమేష్, అలాగే హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు