వరల్డ్ వైడ్ “ధమాకా” డే 1 సాలిడ్ ఓపెనింగ్స్.!

వరల్డ్ వైడ్ “ధమాకా” డే 1 సాలిడ్ ఓపెనింగ్స్.!

Published on Dec 24, 2022 1:00 PM IST

టాలీవుడ్ అందరి ఫేవరెట్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ధమాకా” నిన్ననే సాలిడ్ హైప్ తో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయ్యింది. క్రాక్ తర్వాత మళ్ళీ రవితేజ నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి అయితే ఈ చిత్రం ఓ రియల్ ధమాకా లా నిలిచి సాలిడ్ టాక్ అండ్ అక్యుపెన్సీ దక్కించుకొని ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నట్టు తెలుస్తుంది.

ఇక నిన్న మొదటి షో నుంచే మంచి టాక్ రావడంతో వెంటనే మాస్ మహారాజ్ తన ‘పవర్’ చూపించాడు. అలా ఫస్ట్ డే అయితే ధమాకా వరల్డ్ వైడ్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఫస్ట్ డే 10 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీనితో అయితే రవితేజ కెరీర్ లో ఇది మరో బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. అలాగే సినిమా మరింత పికప్ అవుతూ ఉండడంతో ఈ వీకెండ్ లో కూడా మరింత బెటర్ వసూళ్లు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు