వరల్డ్ వైడ్ “ధమాకా” 2 డేస్ సూపర్ స్ట్రాంగ్ వసూళ్లు.!

వరల్డ్ వైడ్ “ధమాకా” 2 డేస్ సూపర్ స్ట్రాంగ్ వసూళ్లు.!

Published on Dec 25, 2022 1:00 PM IST

మన టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం వచ్చి రవితేజ కెరీర్ లో మరో హిట్ గా నిలిచి సాలిడ్ కం బ్యాక్ గా నిలిచింది. ఇక మొదటి రోజే ఈ చిత్రం రవితేజ కెరీర్ లో మరో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఇది నిలవగా ఇప్పుడు అయితే రెండో రోజు కూడా వరల్డ్ వైడ్ సూపర్ స్ట్రాంగ్ వసూళ్లు ఈ చిత్రం నమోదు చేసినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు.

మరి రెండు రోజుల్లో అయితే ధమాకా చిత్రం మొత్తం 19 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మరి డే 1 పది కోట్లు అందుకున్న ఈ చిత్రం డే 2 తొమ్మిది కోట్లు వసూలు చేసింది. దీనితో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రన్ నడుస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆదివారం కూడా సినిమాకి మంచి నంబర్స్ నమోదు అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సాలిడ్ హిట్ ఆల్బమ్ ని అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు