వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “ధమాకా”

Published on Mar 19, 2023 5:50 pm IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రం గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది.

ఈ చిత్రం స్టార్ మా లో మార్చ్ 26, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం లో మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :