‘ధమాకా’ హిందీ వర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ లాక్

Published on Jun 1, 2023 12:01 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తరికెక్కిన తాజా మాస్ యాక్షన్ సూపర్ హిట్ మూవీ ధమాకా. బెజవాడ ప్రసన్నకుమార్ కథని అందించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఇటీవల మంచి అంచనాలతో విడుదలై భారీ విజయం అందుకున్న ధమాకా అటు ఓటీటిలో కూడా విడుదలై ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా అటు హిందీ వర్షన్ లో కూడా థియేటర్స్ లో విడుదలై అలరించగా, తాజా న్యూస్ ఏంటంటే ఈ సినిమా హిందీ వర్షన్ ని జూన్ 17న రాత్రి 8 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ సినిమాలో ప్రసారం చేయనున్నన్నారు. మరి అక్కడి టివి ఆడియన్స్ ని ధమాకా ఎంతమేర అల్లరిస్తుందో చూడాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మరియు అభిషేక్ అగర్వాల్ బ్యానర్స్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక కూచిభొట్ల ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు.

సంబంధిత సమాచారం :