“ధమ్కీ” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

“ధమ్కీ” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on Dec 2, 2022 10:40 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రం ధమ్కీ కోసం మరోసారి మెగాఫోన్ పట్టాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, పాన్ ఇండియన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

ఫస్ట్ సింగిల్ ను డిసెంబర్ 5, 2022న విడుదల చేస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. టైమ్ ఇంకా వెల్లడి కాలేదు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2022న థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు