వరల్డ్ వైడ్ “ధమ్కీ” 2 రోజుల్లో సాలిడ్ వసూళ్లు.!

Published on Mar 24, 2023 2:08 pm IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా అక్షర గౌడ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా “ధమ్కీ” కోసం అందరికీ తెలిసిందే. విశ్వక్ సేన్ నే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాను డ్యూయల్ రోల్ లో అయితే నటించాడు. మరి ఈ సినిమా ఈ ఉగాది కానుకగా రిలీజ్ అయ్యి విశ్వక్ కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ అయితే అందుకుంది. దీనితో ఈ ప్రాజెక్ట్ రెండో రోజు వసూళ్లు ఎలా నమోదు అవుతాయా అని అంతా ఆసక్తిగా చూసారు.

మరి వరల్డ్ వైడ్ మొదటి రోజు ఈ సినిమా 8.8 కోట్ల గ్రాస్ ని అందుకోగా రెండో రోజు 3.01 కోట్ల గ్రాస్ తో అయితే మొత్తం రెండు రోజుల్లో 11.9 కోట్ల మార్క్ కి చేరింది. దీనితో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ వారాంతంతో అయితే ఎలా లేదన్నా విశ్వక్ కెరీర్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మైల్ స్టోన్స్ ని ఈ సినిమా టచ్ చేస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే లియోన్ జేమ్స్ సంగీతం అందించగా కరాటే రాజు మరియు విశ్వక్ సేన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :