యూఎస్ లో స్ట్రాంగ్ గా ధనుష్ సినిమా.!

Published on Feb 22, 2023 2:00 pm IST

కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “వాథి” తెలుగులో “సార్” పేరిట తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు లో ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే తమిళ్ లో కూడా మంచి రన్ లో దూసుకెళ్తున్న ఈ చిత్రం యూఎస్ లో కూడా మంచి రన్ తో అయితే కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది.

మరి అక్కడ ఈ చిత్రం తెలుగు సహా తమిళ్ వెర్షన్ కలిపి లేటెస్ట్ గా 3 లక్షల డాలర్స్ మార్క్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో అయితే ఈ చిత్రం నెక్స్ట్ హాఫ్ మిలియన్ కి చేరుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హైపర్ ఆది, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించగా జివి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :