రజనీ పొలిటికల్ ఎంట్రీ పై నోరు విప్పిన ధనుష్ !


తమిళ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘విఐపి-2’ యొక్క ఆడియో లాంఛ్ నిన్న సాయంత్రం ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ధనుష్ తో పాటు, కాజోల్, అమలా పాల్, ఇతర టాప్ సెలబ్రిటీలు హాజరుయ్యారు. ఈ సందర్బంగా కార్యక్రమం చివర్లో మీడియాతో సమావేశమయ్యారు ధనుష్. ఈ సమావేశంలో చాలా మంది రజనీకాంత్ గారి పొలిటికల్ ఎంట్రీ పై మీ అభిప్రాయమేమిటి అని ధనుష్ ను ప్రశ్నించారు.

దానికి ధనుష్ ‘ఆయన రాజకీయాల్లో రాకముందు ఎందుకు రాలేదో మీకేమన్నా అభిప్రాయముందా.. ఇది కూడా అంతే. నా అభిప్రాయం నాకుంటుంది, మీ అభిప్రాయం నాకుంటుంది. నా అభిప్రాయాన్ని నాతోనే ఉంచుకుంటాను’ అంటూ ఎలాంటి గొడవా లేకుండా చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. గత కొన్నాళ్లుగా తమిళనాట రజనీ రాజకీయ రంగప్రవేశం పెద్ద హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రజనీ త్వరలోనే స్పష్టమైన ప్రకటన ఇవ్వనున్నారు.