హీరో ధనుష్, ఐశ్వర్య దంపతుల విడాకులు..!

Published on Jan 18, 2022 1:32 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్‌ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్‌ దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని ధనుష్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ తమ 18 ఏళ్ల వివాహ జీవితాన్ని ముగిస్తున్నామని, స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా కలిసి ఉన్న మేము ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో వెళుతున్నామని, అందుకే మేమిద్దరం జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ విషయంలో మాకు అవసరమైన గోప్యతను ఇవ్వండి. ఓం నమశివాయ! ప్రేమతో మీ ధనుష్‌.. అని ఉన్న లేఖను పోస్ట్‌ చేశాడు.

ఇదిలా ఉంటే 2004లో ధనుష్‌, ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత వీరు విడిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :