గ్రాండ్ గా జరిగిన ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ లాంచింగ్ ఈవెంట్

Published on Sep 23, 2022 2:01 am IST

ధనుష్ హీరోగా సందీప్ కిషన్ ఒక ముఖ్య పాత్రలో యువ దర్శకుడు అరుణ్ మాథెశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కెప్టెన్ మిల్లర్. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నివేత సతీష్ కూడా ఒక కీలక రోల్ చేస్తున్నారు. 1930-40 సమయంలో జరిగిన కథగా ఎంతో ప్రతిష్టాత్మకంగా టిజి త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

కాగా ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ తో అందరిలో మంచి ఆసక్తిని ఏర్పరిచిన కెప్టెన్ మిల్లర్ మూవీని నేడు అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసింది యూనిట్. ఈ కార్యక్రమంలో మూవీ హీరో ధనుష్, హీరోయిన్ ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, నివేత సతీష్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొనగా త్వరలో సెట్స్ పైకి దీనిని తీసుకెళ్లనున్నామని, అలానే వీలైనంత త్వరలో మూవీని కంప్లీట్ చేస్తాం అని చెప్తోంది యూనిట్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :