లేటెస్ట్ : ఫ్యాన్స్ కి ధనుష్ ఎమోషనల్ ప్రెస్ నోట్ … !!

Published on Jul 29, 2022 11:30 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ పరంగా బిజీగా కొనసాగుతున్నారు. లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ లో కీలక పాత్ర చేసి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ నుండి సూపర్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ధనుష్ ప్రస్తుతం తిరుచిత్రంబలం, కెప్టెన్ మిల్లర్, సర్ సినిమాలు చేస్తున్నారు. ఈ మూడు సినిమాలపై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ హైప్ ఉంది.

అయితే విషయం ఏమిటంటే, నిన్న ధనుష్ బర్త్ డే సందర్భంగా పలువురు ఆయన ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు అనేకమంది సినిమా ప్రముఖులు తనకు వెల్లువలా బర్త్ డే విషెస్ చెప్పడం జరిగింది. నిన్న అంతా పలు సోషల్ మీడియా మాధ్యమాలు ధనుష్ బర్త్ డే ట్యాగ్స్ తో నిండిపోయాయి. కాగా ప్రేక్షకులు, అభిమానులు తన పై ఇంత ప్రేమ, అభిమానం చూపిస్తున్నందుకు ఎంతో ఆనందముగా ఉందని, కెరీర్ పరంగా తనతో వారందరూ 20 ఏళ్లకు పైగా అభిమానాన్ని కలిగి ఉన్నారని, వారందరికీ ఒక పెద్ద హగ్ ఇస్తున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎమోషనల్ అవుతూ కొద్దిసేపటి క్రితం ఒక ఎమోషనల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు ధనుష్.

సంబంధిత సమాచారం :