రజినీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ కి మైమరచిపోయిన ధనుష్ !

15th, December 2016 - 11:51:02 AM

vip2
తమిళ యువ స్టార్ హీరోల్లో రజనీకాంత్ మేనల్లుడు ధనుష్ కూడా ఒకరు. ధనుష్ కి రజనీకాంత్ అంటే ఎంతటి గౌరవమో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి రజనీ చేతుల మీదుగానే ధనుష్ కొత్త సినిమా ‘విఐపి2’ లాంచ్ జరిగింది. ఈరోజు ఉదయం సినిమా యూనిట్ సమక్షంలో రజనీ ధనుష్ పై మొదటి క్లాప్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించారు. అలాగే ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా రజనీకాంత్ తన మూవీకి క్లాప్ ఇచ్చి ఆశీర్వదించడంతో ధనుష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ధనుష్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ‘ఇంతకన్నా ఏం కోరుకొగలను. మీకు నా కృతజ్ఞతలు. మీ ఆశీస్సులతో విఐపి 2 షూటింగ్ మొదలైంది’ అన్నారు. 2014లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన ‘విఐపి’ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తుండగా వి క్రియేషన్స్ బ్యానర్ ఫై ఎస్. థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తోంది.