ధనుష్ తొలి తెలుగు సినిమా టైటిల్ రేపే..!

Published on Dec 22, 2021 10:41 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. అయన హీరోగా నటించిన తమిళ్ సినిమాల్లో కొన్ని తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్‌లో డైరెక్ట్ ఫిల్మ్ చేయని ధనుష్ ఈ మధ్యే వరుస తెలుగు సినిమాలకు ఒకే చెబుతున్నాడని తెలుస్తుంది. అయితే తాజాగా యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరితో తన తొలి తెలుగు సినిమాను చేస్తున్నట్టు ధనుష్ ప్రకటించేశాడు.

ఈ మేరకు తమిళంలో నా నెక్స్ట్‌ సినిమా, తెలుగులో నా తొలి సినిమా రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు టైటిల్‌ వెల్లడిస్తామంటూ ధనుష్ ట్వీట్ చేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. చూడాలి మరీ మేకర్స్ ధనుష్ తొలి తెలుగు సినిమకు ఎలాంటి టైటిల్‌ని ఫిక్స్ చేశారన్నది.

సంబంధిత సమాచారం :