లేటెస్ట్..ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ధనుష్ మొట్టమొదటి తెలుగు చిత్రం.!

Published on Dec 23, 2021 10:00 am IST

సౌత్ ఇండియన్ సినిమా దగ్గర పలువురు వెర్సిటైల్ హీరోల జాబితాలో టాలెంటెడ్ హీరో ధనుష్ పేరు కూడా ఖచ్చితంగా నిలుస్తుంది. ఎలాంటి పాత్రలో అయినా కూడా ఇమిడిపోయే ధనుష్ మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. మరి ఈరోజు ఆ సినిమా అనౌన్సమెంట్ ని ఈరోజు మేకర్స్ అందించారు.

ఆసక్తికర మోషన్ టీజర్ తో ఈ సినిమాకి “సార్” అనే టైటిల్ ని రివీల్ చేశారు. అలాగే తమిళ్ లో కూడా ఈ చిత్రాన్ని “వాతి” అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. అలాగే ఇందులోనే ఈ సినిమా లో కంటెంట్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో అనేది కూడా రివీల్ చేసే యత్నం చేశారు.

ఇది మాత్రం చాలా ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా నాగవంశీ మరియు సాయి సౌజన్య లు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. అలానే టాలెంటడ్ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ సంగీతం అందివ్వనున్నాడు.

సంబంధిత సమాచారం :