ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందిగా..స్టన్నింగ్ వీడియో రిలీజ్..!

ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందిగా..స్టన్నింగ్ వీడియో రిలీజ్..!

Published on Jul 12, 2022 7:06 AM IST


మన దక్షిణాది సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర ఒక ఫైనెస్ట్ నటులలో స్టార్ హీరో ధనుష్ కూడా ఒకడు. మరి ధనుష్ హీరోగా ఇప్పుడు పలు రీజనల్ సినిమాలతో పాటుగా భారీ పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక అలాగే వీటిని మించి ధనుష్ నుంచి హాలీవుడ్ ఎంట్రీ అయినటువంటి “ది గ్రే మ్యాన్” కోసం వీక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రసో బ్రదర్స్ ప్రముఖ హీరో క్రిస్ ఇవాన్స్ తో చేసిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో ధనుష్ కూడా కీలక పాత్రలో చేయడం జరిగింది. అయితే గత కొన్నాళ్ల కితం ట్రైలర్ రిలీజ్ చెయ్యగా అందులో ధనుష్ ని చిన్న బిట్ లో చూపించారు. కానీ ఇప్పుడు అయితే ఏకంగా ఒక స్టన్నింగ్ సీక్వెన్స్ ని దర్శకులు రిలీజ్ చేశారు.

ఇక ఇది మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. ధనుష్ లోని సత్తాను తెలియజేసేలా హాలీవుడ్ ఎంట్రీ ని అయితే మేకర్స్ సిద్ధం చేశారు. మరి ఈ జూలై 22న నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కాబోతున్న ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇంగ్లీష్, తమిళ్ తెలుగు సహా అన్ని భాషల్లో ఇది విడుదల కాబోతోంది.

https://twitter.com/Russo_Brothers/status/1546650635721797632

సంబంధిత సమాచారం

తాజా వార్తలు