రిలీజ్ డేట్ లాక్ చేసిన ధనుష్ !
Published on May 10, 2017 9:22 am IST


హీరో ధనుష్ ప్రస్తుతం తన సూపర్ హిట్ చిత్రం ‘విఐపి’ కు సీక్వెల్ గా ‘విఐపి-2’ ను రూపొందించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై మంచి అంచనాలున్నాయి. తెలుగులో సైతం ‘రఘువరన్ బిటెక్’ గా రిలీజైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సీక్వెల్ ను సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తుండగా కథ, మాటలు ధనుష్ అందివ్వడం విశేషం.

ఇకపోతే ఈ చిత్రాన్ని జూలై 28న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ధనుష్ కి జంటగా మరోసారి అమలాపాల్ నటించనుండగా బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో కూడా జూలై 28వ తేదీనే ‘రఘువరన్ బీటెక్ -2’ పేరుతో విడుదల చేయనున్నారు.

 
Like us on Facebook