నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న ధనుష్ “మారన్”..!

Published on Feb 28, 2022 11:15 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన “మారన్” ఓటీటీలో విడుదలకు సిద్దమయ్యింది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అర్జున్, త్యాగరాజన్‌లు సంయుక్తంగా నిర్మించారు. అయితే తాజాగా “మారన్” తెలుగు ట్రైలర్ను డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగు విడుదల చేసింది. మార్చి 11 నుంచి ఈ చిత్రం నేరుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్లు ఇప్పటికే మూవీపై అంచనాలు పెంచాయి. ఇకపోతే ఈ సినిమాలో ధనుష్ సరసన మాళవికా మోహనన్ నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నాడు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :