ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ “నేనే వస్తున్నా”.!

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ “నేనే వస్తున్నా”.!

Published on Oct 22, 2022 5:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైనటువంటి ధనుష్ హీరోగా చేసిన సినిమాలతో మళ్ళీ కెరీర్ లో మంచి హిట్స్ వరుసగా అందుకుంటున్నాడు. ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ లో కూడా చేసి తాను ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ఏడాది లోనే ధనుష్ నుంచి మూడు చిత్రాలు రాగా ఆ చిత్రాల్లో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ తో చేసిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “నేనే వస్తున్నా” కూడా ఒకటి.

తమిళ్ లో నానే వరువీన్ గా వచ్చిన ఈ చిత్రం డీసెంట్ పెర్ఫామెన్స్ బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో అలరించేందుకు సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దిగ్గజ ఓటిటి సంస్థ ప్రైమ్ వీడియో వారు అన్ని భాషలలో కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం ఈ అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి అపుడు మిస్ అయ్యి ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్నవారు ఈసారి చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు