కౌబాయ్ గెటప్‌లో ధనుష్.. లుక్ అదిరిందిగా..!

Published on Oct 17, 2021 1:34 am IST


కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ధనుష్ హీరోగా కొత్త సినిమా ఆరంభమయ్యింది. ధనుష్ తో ‘అసురన్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు తీసిన వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్ థాను సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఈ సినిమాని చేయనున్నాడు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగు నేడు ప్రారంభమయ్యిది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. కౌబాయ్ గెటప్‌లో హంటర్‌లా ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన హీరోగా, విలన్ గా ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇందుజా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :