సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ధనుష్ “సార్”.!

Published on Feb 16, 2023 9:00 am IST

కోలీవుడ్ గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సార్”. మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా మంచి అంచనాలు నడుమ అయితే రేపు ఫిబ్రవరి 17న తెలుగు సహా తమిళ్ లో రిలీజ్ కి సిద్ధం కాబోతుంది. మరి ఈరోజు అయితే హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ కూడా మేకర్స్ సిద్ధం చేయగా కొన్ని గంటల్లోనే అన్ని షో లు అమ్ముడుపోయాయి.

ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు సెన్సార్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి గాను సెన్సార్ యూనిట్ అయితే క్లీన్ యూ సర్టిఫికెట్ ని అందించారట. అంతే కాకుండా ఈ సినిమా యూనిట్ కి వారు స్పెషల్ అప్లాజ్ కూడా అందించినట్టు తెలుస్తుంది. సినిమా కాన్సెప్ట్ మరియు అవుట్ పుట్ పై అయితే మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి మరికొన్ని గంటల్లో అయితే సినిమా అసలు ఫలితం తేలిపోనుంది.

సంబంధిత సమాచారం :