ఓటిటిలో మరో రెండు భాషల్లో ధనుష్ “సార్”.!

Published on Mar 29, 2023 2:00 pm IST

కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం “సార్” కోసం తెలిసిందే. ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలవడమే కాకుండా భారీ వసూళ్లు కూడా అందుకుంది. మరి ఈ సినిమా థియేటర్స్ లో మాత్రమే కాకుండా దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ తో అయితే ఇండియా ట్రెండ్స్ లో నిలిచింది.

మరి మొదటగా ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకురాగా నెక్స్ట్ అయితే హిందీలో కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇప్పుడు అయితే ఈ మూడు భాషలతో పాటుగా కన్నడ మళయాళం లో కూడా స్ట్రీమింగ్ కి తీసుకొచ్చినట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు కన్ఫర్మ్ చేశారు. దీనితో మొత్తానికి అయితే పాన్ ఇండియా భాషల్లో ధనుష్ సార్ ట్రీట్ ఇవ్వనున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :