తెలుగులోనే బెటర్ గా “సార్” వసూళ్లు.!

Published on Mar 4, 2023 12:26 am IST


కోలీవుడ్ టాలెంటెడ్ అండ్ వెర్సటైల్ హీరో ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ హిట్ సినిమా “సార్” కోసం తెలిసిందే. మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్ లో “వాథి” పేరిట రిలీజ్ అయ్యింది. అయితే ధనుష్ కి మన తెలుగు కన్నా తన నేటివ్ రీజన్ తమిళ్ లోనే ఎక్కువ మార్కెట్ ఉందని తెలిసిందే.

కానీ ఈ సినిమా విషయంలో మాత్రం రివర్స్ అయ్యింది అని చెప్పాలి. వసూళ్ల పరంగా ఈ చిత్రానికి తమిళనాడు తో పోలిస్తే సుమారుగా తెలుగు రాష్ట్రాల వసూళ్లు వచ్చేసాయి. దీని బట్టి తన మార్కెట్ కన్నా మన దగ్గరే బెటర్ వసూళ్లు వచ్చాయని చెప్పడంలో సందేహమే లేదు. అలాగే ధనుష్ ఫ్యాన్స్ కూడా తమిళ ఆడియెన్స్ కన్నా మనవాళ్లే అద్భుతంగా మన ఆడియెన్స్ ఆదరణ అందించారని కూడా అనుకుంటున్నారు.

అయితే ఇది ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా వాథి కి ఇదే పరిస్థితి. మొదటి రోజు నుంచి తమిళ్ వెర్షన్ కన్నా తెలుగులోనే ఎక్కువ వసూళ్లు దీనికి నమోదు అవ్వడం విశేషం. అలాగే ఇప్పటికీ కూడా తెలుగు వసూళ్లు తమిళ్ కన్నా బెటర్ గా రిజిస్టర్ అవుతున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

సంబంధిత సమాచారం :