ఇంట్రెస్టింగ్.. రెండో వారంలో మరింత హోల్డ్ తో “సార్”.!

Published on Feb 25, 2023 7:03 am IST


కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం “సార్” కోసం తెలిసిందే. మరి తమిళ్ లో వాథి పేరిట వచ్చిన ఈ సినిమా అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సంతరించుకుని ధనుష్ కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మొదటి వీకెండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సోమవారం నుంచి కూడా మంచి హోల్డ్ ని అందుకోగా ఇదే హవా ని సార్ యూఎస్ లో కూడా అందుకుంది.

అయితే ఈ సినిమా ఇప్పుడు యూఎస్ లో రెండో వారానికి మరిన్ని స్క్రీన్స్ ని యాడ్ చేసుకుంటుందట. దీనితో సార్ సినిమా అదిరే హోల్డ్ ని కనబరుస్తుంది అని చెప్పాలి. మంచి ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అయితే మేకర్స్ పెట్టుకున్న నమ్మకానికి ఆడియెన్స్ కూడా అంతే సాలిడ్ రిజల్ట్ అందించారని చెప్పాలి. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :