సాలిడ్ గా ధనుష్ “సార్” లేటెస్ట్ పోస్టర్స్.!

సాలిడ్ గా ధనుష్ “సార్” లేటెస్ట్ పోస్టర్స్.!

Published on Oct 24, 2022 9:05 AM IST

తమిళ నాట స్టార్ హీరో సహా గ్లోబల్ గా కూడా మంచి ఆదరణ ఉన్న స్టార్ హీరో ధనుష్ కోసం తెలిసిందే. తన వెర్సటాలిటీ తో ఎన్నో ఐకానిక్ రోల్స్ చేస్తూ వస్తున్న తాను ఇపుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలతో సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ చిత్రాల్లో అయితే మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్న బై లాంగువల్ చిత్రం “సార్” కూడా ఒకటి. మరి మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి ఈరోజు ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మరి ఈ కొత్త పోస్టర్ అయితే మంచి ఆసక్తిగా ఉందని చెప్పాలి. ధనుష్ ని స్టూడెంట్ గెటప్ లో చూపిస్తూ ఓ సాలిడ్ యాక్షన్ బ్లాక్ నుంచి అయితే మేకర్స్ తెలుగు సహా తమిళ్ లో రిలీజ్ చేశారు. దీంతో అయితే ధనుష్ ఫ్యాన్స్ కి ఈ దీపావళి బ్లాస్ట్ దొరికినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు