స్కూల్ పిల్లల కోసం “సార్” నిర్మాత గొప్ప నిర్ణయం.!

Published on Mar 4, 2023 3:14 pm IST

లేటెస్ట్ గా టాలీవుడ్ సహా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యి మంచి హిట్ మరియు వసూళ్లతో పాటుగా అంతకు మించిన మంచి పేరు అయితే అందుకున్న చిత్రం “సార్”. గ్లోబల్ నటుడు ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ లో మంచి స్పందనను అందుకుంది. అంతే కాకుండా చాలా మందిని ఆలోచింపజేసేలా చేసిన ఈ సినిమా నిర్మాత యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అయితే కీలక స్టెప్ తీసుకోవడం హర్షణీయం అని చెప్పాలి.

తన సార్/వాథి చిత్రాన్ని విద్య తాలూకా ఉన్నతమైన విలువని అందరికీ తెలియజేయాలని చేసిన ప్రయత్నమే అందుకే ఇప్పుడు స్కూల్ చదువుతున్న పిల్లలు అందరికీ కూడా ఫ్రీ గా ఈ చిత్రాన్ని ఇక ప్రదర్శనకు తీసుకొస్తామని వివరాల కొరకు తమ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని నాగ వంశీ తెలిపారు. ఇది మాత్రం మంచి నిర్ణయం అని చెప్పాలి. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఆదర్శ ఉపాధ్యాయులు సార్ సినిమాని పిల్లలకు ప్రత్యేకంగా తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇప్పుడు చిత్ర యూనిట్ నిర్ణయం మరింత ప్లస్ అయ్యి మరింత మందికి చేరువయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :