తమిళ హీరో ధనుష్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్ చూస్తే ఆయన చేయబోయే సినిమాలు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ధనుష్ కెరీర్‌లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన కల్ట్ డైరెక్టర్ వెట్రి మారన్‌తో ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.
వీరి కాంబినేషన్‌లో నాలుగు సక్సెస్‌ఫుల్ చిత్రాలు వచ్చాయి. అందులో ఆడు కాలం, వడా చెన్నై, అసురన్ వంటి బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు వెట్రిమారన్‌తో ధనుష్ 5వ సారి చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమాను ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు.
దీంతో ధనుష్ ఫ్యాన్స్‌తో పాటు వెట్రి మారన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ధనుష్ ప్రస్తుతం ‘కుబేర’, ‘ఇడ్లీ కడాయ్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అటు వెట్రి మారన్ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ ‘విడుదల 2’ విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది.